నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలోని కేశవపట్నం పోలీస్ స్టేషన్ లో బుధవారం నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన కొత్తపల్లి రవి, ఇక్కడ విధులు నిర్వహించిన పాకాల లక్ష్మారెడ్డి టాస్క్ ఫోర్స్ కి బదిలీ కావడంతో కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహించిన కొత్తపల్లి రవి ఎస్సైగా విధులు నిర్వహిస్తు అక్కడి ప్రజల మన్ననలు పొందారు. నూతన ఎస్సైగా పదవి బాధ్యతలు చేపట్టడంతో మండల ప్రజలు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.