హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న జైనూర్ ఘటన బాధితురాలు మెస్రం నీలబాయిని తెలంగాణ రాష్ట్ర జీసీసీ ఛైర్మెన్ కొట్నక్ తిరుపతి గాంధీఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడుతూ నీలబాయి ఆరోగ్యపరిస్థితి గురించి అడిగి తెలుసుకుని, బాధిత మహిళకు మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకునేలా చేయాలని అన్నారు. కాగా సర్జరీ అవడంతో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల బృందం ఆధ్వర్యంలో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని వైద్య బృందం తెలిపారు..తదుపరి నీలబాయి కుటుంబ సభ్యులతో మాట్లాడి దైర్యంగా ఉండాలని భరోసానిస్తూ వారికి ఆర్థిక సహాయాన్ని అందించారు…