తల్లి దండ్రులు మందలించారని కౌలాస్ డ్యాం లో దూకి ఆత్మహత్య

నవతెలంగాణ – జుక్కల్
తల్లి దండ్రులు మందలించారని కౌలాస్ ప్రాజేక్ట్ లో యువకుడు దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని సావర్ గావ్ డ్యాం వద్ద చోటు చేసుకుంది. జుక్కల్ ఎస్సై మురళి, కుటింబికులు తెలిపిన వివరాల ప్రకారం బిచ్కుంద మండలం రాజుల్లా గ్రామానికి చెందిన సాయికూమార్ తండ్రి బాలింగం వృత్తి వ్యవసాయం, వయస్సు 25 సంవత్సరాలు ఇటివలే మూడు నెలల క్రితం వివాహం అయింది. ఖాలిగా ఇంటివద్జే ఉండటంతో కుటింబికులు మందలించారు. మనస్తాపం చెంది జూన్ 13వ తేదిన ఇంటి నుండి బిచ్కుంద వెళ్తానని చెప్పి తిరిగి ఇంటికి రాక పోవడంతో చుట్టాలు, తెలిసిన వారికి అడిగిన ఆచూకి తెలియలేదు. జుక్కల్ మండలంలోని కౌలాస్ ప్రాజేక్ట్ వద్ద ద్విచక్ర వాహనం నిలిపి ఉంచి నీటీలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడం జర్గింది. శవం గురువారం నీటి పైన తేలియాడటంతో ప్రాజేక్ట్ వాచ్ మెన్ సుదాకర్ పోలీసులకు సమాచారం అందించారు. శవాన్ని తీసీ ఆచూకి తీయడంతో రాజుల్లా గ్రామానికి చెందినదిగా తెల్సింది. తల్లిదండ్రులు గుర్తించారు. తండ్రి బాలింగం ఫిర్యాదు మేరకు 174 సెక్షన్ కింద కేసులనమేాదు చేసుకోవడం జర్గింది. దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహన్ని పీఎమ్ కు పంపడం జర్గిందని ఎస్సై మురళి తెలిపారు.