ప్రపంచాన్ని ఐక్యం చేసే గిరిజనులు, కోయలు

– సదస్సులో నర్రా ప్రవీణ్ రెడ్డి
నవతెలంగాణ – హైదరాబాద్:
తెలుగు జానపద సాహిత్య పరిషత్తు,  దాక్షిణాత్య జానపద విజ్ఞాన సంస్థ సంయుక్తంగా నిర్వహించిన “జానపద విజ్ఞానం – పరిరక్షణ – చర్చా” రెండు రోజుల సదస్సులో ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ నర్రా ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు. ” కోయ గిరిజన పండుగలు, సాంస్కృతిక విశేషాల” పై పత్రసమర్పణ చేసి అనంతరం ఆచార్య పులికొండ సుబ్బాచారి, డా.భక్తవత్సల రెడ్డి, సీహెచ్ వసుంధర, పగడాల చంద్రశేఖర్, ప్రొఫెసర్ సూర్యాధనంజయ తదితర పెద్దలతో చర్చల్లో పాల్గొన్నారు. కోయ గిరిజనుల పండుగల్లో వైవిధ్యత ఉందని, ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల్లో వీరు నివసిస్తున్నారని, గోండు, తెలుగు భాషలు మాట్లాడుతున్నారని తెలిపారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను జరుపుతూ ప్రపంచాన్ని ఐక్యం చేసిన ఘనత ఈ గిరిజనులదని నర్రా ప్రవీణ్ రెడ్డి ఈ సదస్సులో పరిశోధనాత్మకంగా ప్రసంగించారు.  పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ సదస్సులో రిజిస్ట్రార్ భట్టు రమేష్, తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు ఎల్లూరి శివారెడ్డి, డా. కసిరెడ్డి వెంకట్ రెడ్డి, డా.బిట్టు వెంకటేశ్వర్లు, చిగిచర్ల కృష్ణారెడ్డి, డా.కె.శ్యామల, డా.జ్యోతి తదితర జానపద శాస్త్రవేత్తలు పాల్గొని నర్రాను అభినందించారు.