
– వన్యప్రాణుల విలవిల
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ రేంజ్ పరిధిలోని మల్లారం, వళ్లెంకుంట బిట్ పరిధిలోగల అడవిలో అభయారణ్యంలో మంగళవారం రాత్రి నుంచి కార్చిచ్చు రగులుతుంది. విలువైన వన సంపద అగ్నికి ఆహుతవుతోంది.అడవిలోని పక్షి జాతులు, సరీసృపాలు, వన్యప్రాణులు భయంతో పరుగులు తీసున్నాయి. వేసివిలో అడవుల్లో అగ్గి రాజుకోకుండా చేపట్టే పైర్ లైన్ పనులు చేపట్టకపోడంతో కొయ్యుర్ అడవుల్లో కార్చిచ్చు రగులుతుందన్న అభిప్రాయం పలువురు నుంచి వ్యక్తమవుతోంది.ఇప్పల వద్ద మిషన్ భగీరథ వాటర్ ట్యాoకు నుంచి నాగులమ్మ అడవుల్లో మంటలు చెలరేగుతున్న అటవీశాఖ అధికారులు మాత్రం ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.
మంటలకు అనేక రకాలు..
భూపాలపల్లి జిల్లా పారెస్ట్ డివిజన్ లోని కొయ్యుర్ రేంజ్ పరిధిలో మొత్తం 14 వేల170 హెక్టార్ల, 35 వేళా ఎకరాల అటవీ భూమి విస్తరించి ఉంది. అడవులు కాలడానికి ముఖ్య కారణం తునికాకు సేకరణకు ముందు ప్రూనింగ్ కు బదులు అడవులను కాల్చుతుంటారనే ఆరోపణలున్నాయి. అలాగే అడవుల్లో తిరిగే వ్యక్తులు బీడీలు, సిగరెట్ లు తాగి వాటిని ఆర్పేయకుండానే పడవేయడం వలన రాలిన ఆకులకు అంటుకొని నెల వేప, దేవదారి, నల్లమద్ది వంటి గట్టి చెట్టుకు చెట్టుకు తాకడం వల్ల కూడా మంటలు వచ్చే అవకాశం ఉంది.
వన్యప్రాణులు విలవిల..
కొయ్యుర్ రేంజ్ పరిధిలో 14 వేల 170 హెక్టార్ల అటవిలో ఎక్కువగా కుందేళ్లు, దుప్పులు, కొండ గొర్రెలు,జింకలు, నక్కలు, అడవి పందులు, కోతులు, సర్పాలు ఉన్నాయి. అడవిలో మంటలు చెలరేగడంతో వన్యప్రాణులు విలవిల్లాడుతున్నాయి.
కొయ్యుర్ రేంజ్ పరిధిలో 14 వేల 170 హెక్టార్ల అటవిలో ఎక్కువగా కుందేళ్లు, దుప్పులు, కొండ గొర్రెలు,జింకలు, నక్కలు, అడవి పందులు, కోతులు, సర్పాలు ఉన్నాయి. అడవిలో మంటలు చెలరేగడంతో వన్యప్రాణులు విలవిల్లాడుతున్నాయి.
ఫైర్ లైన్ లేకనే..
వన్యప్రాణుల సంరక్షణ ఏరియాలో అగ్ని ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించిన అటవీశాఖ అధికారులు నివారణ చర్యలను ఆయా బిట్ అధికారులకు అప్పగించారు. రహదారులకు ఇరువైపులా 5 ప్లేస్ 5 మీటర్ల వెడల్పుతో మూడు మీటర్ల మేర రాలిన ఆకులను పోగు చేసి కాల్సి వేయాలి. ఈ ఫైర్ లైన్ పనుల నిర్వహణ కోసం ప్రతి కిలో మీటర్ కు అటవీశాఖ రూ.2 వేలు ఖర్చు చేసేలా రేంజ్ కు ఏటా రూ.లక్ష విడుదల చేస్తోంది. అయితే కొయ్యుర్ రేంజ్ కు ఈ సంవత్సరం నిధులు రానట్లుగా సమాచారం.
శాటిలైట్ ద్వారా పర్యవేక్షిస్తే మేలు..
కొయ్యుర్ అటవీప్రాంతంలో శాటిలైట్ ద్వారా నిఘా ఉంటే మేలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో ఎక్కడైనా మంటలు చెలరేగితే పారెస్ట్ సర్వే అప్ ఇండియా ఉపగ్రహాల ద్వారా గుర్తించడంతోపాటు ఇక్కడి అధికారులను అప్రమత్తం చేస్తే చాలా వరకు మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది.అలాగే ఫైర్ వాచర్లకు వాహనాలు మంటలను ఆర్పే పరికరాలను అందించడం ఫైర్ లైన్లను ఎప్పటికప్పుడు పరిశీలించడం వాచ్ టవర్ల ను పెట్టాల్సి ఉంది. వీటితోపాటు వేసవిలో తాత్కాలిక పద్దతిలో ఫైర్ వాచర్లకు నియమించుకొని పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తే మేలు.