ఆదర్శ్‌నగర్‌లో క్రిశాంక్‌ ‘బస్తీనిద్ర’

నవతెలంగాణ-కంటోన్మెంట్‌
కంటోన్మెంట్‌ బోర్డ్‌ ఎనిమిదో వార్డ్‌లోని ఆదర్శనగర్‌లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు తెలంగాణ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ మన్నే క్రిశాంక్‌ బస్తీ నిద్ర కార్యక్ర మాన్ని నిర్వహించారు. స్థానికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంచినీరు, మురుగు కాలువలు, పెన్షన్ల సమస్యలను స్థానికులు ఈ సందర్భంగా క్రిశాంక్‌కు వివరించారు. అనంతరం చైర్మెన్‌ కృష్ణ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసమే బస్తీ నిద్ర కార్యక్రమాలు చేపడుతున్నట్టు వివరించారు. గత పది వారాలుగా ఈ కార్యక్రమం నిర్వహించి అనేక సమస్యలను తెలుసుకున్నామని, పరిష్కా రానికి ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకుపోతు న్నామని చెప్పారు. ముఖ్యంగా తొలగించిన ఓట్లను పునరు ద్ధరించాలని, ఇండ్ల పట్టాలు, భూ బదలాయింపు లాంటి విషయాలను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ దృష్టికి కూడా తీసుకుపోయామని ఆయన తెలిపారు. అనంతరం స్థానికులతో కలిసి భోజనం చేశారు. యువకులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని వారి సమస్యలను వెలి బుచ్చారు. రాజేష్‌, వేణు, సతీష్‌, రాహుల్‌, రంజిత్‌, మోని, రఘు, సాయి, రాజు తదితరులు పాల్గొన్నారు.