సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కృష్ణకుమారి

Be alert for seasonal diseases: Krishnakumariనవతెలంగాణ – పెద్దవూర
వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పీఓడీటీటీ కృష్ణకుమారి అన్నారు. మంగళవారం మండల కేంద్రం లోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో  ప్రొఫెసర్ జయ శంకర్ జన్మదిన వేడుకలు నిర్వహించి,సీజనల్ వ్యాదులపై సూపర్ వైజర్లు,ఏఎన్ఎం,ఆశావర్కర్లకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యక్తిగత పరిశుభ్రతతోనే వ్యాధులను నివారించవచ్చు అన్నారు. వర్షాకాలంలో వాతావరణంలో మార్పులు వస్తున్నాయని,ఈ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించి దోమలు వృద్ధి చెంది విష జ్వరాలతో పాటు డెంగ్యూ, మలేరియా, అతిసారం, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య సిబ్బంది,ఏఎన్ఎం లు అప్రమత్తంగా ఉండాలన్నారు. సబ్ సెంటర్ల పరిధిలోని అన్ని ప్రభుత్వ, హాస్టల్ వసతి గృహాలు సందరర్శించి విద్యార్థులకు మందులు పంపిణి చేయాలని అన్నారు. ప్రతీ ఏఎన్ఎం, ఆశావర్కర్, సూపర్ వైజర్లు సమయపాలన పాటించి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు.చిన్నారుల వ్యాధి నిరోధక టీకాలు  సమయానికి వేయాలని తెలిపారు. అలాగే హాస్పిటల్ కు, సబ్ సెంటర్ల కు వచ్చిన గర్భిణీ, బాలింతలకు తగిన సలహాలు, సూచనలు ఇస్తూ వారికీ చోదోడుగ ఉండాలని తెలిపారు.నార్మల్ డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రి లో చేయించిన వారికి ప్రోత్సాహక బహుమతులు ఇస్తున్నామన్నారు.ప్రతి వారం ప్రోగ్రెస్ రిపోర్టు పీహెచ్ సీలో సూపించాలని తెలిపారు.వ్యాధుల నివారణ కై తీసుకోవలసిన జాగ్రత్తలు సూచనలను విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి నగేష్, సూపర్ వైజర్ సువర్ణకుమారి,ఏ ఎన్ ఎన్ లు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.