కృష్ణ వర్మ పసిడి పంచ్‌

Krishna Verma Pasidi Punch– మరో ఐదుగురు బాక్సర్ల సిల్వర్‌ షో
– అండర్‌-19 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌
కొలరాడో (యుఎస్‌ఏ): అండర్‌-19 ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో టీమ్‌ ఇండియా యువ బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. మహిళలు, పురుషుల విభాగాల్లో ఓ పసిడి సహా ఐదు పతకాలు భారత్‌ సొంతం చేసుకుంది. మహిళల 75 కేజీల విభాగంలో కృష్ణ వర్మ అదరగొట్టింది. 5-0తో ఏకపక్ష విజయం సాధించింది. ఫైనల్లో జర్మనీ బాక్సర్‌ సిమోన్‌ లెరికను కృష్ణ వర్మ చిత్తు చేసింది. మహిళల 48 కేజీల విభాగంలో చంచల్‌ చౌదరి, 57 కేజీల విభాగంలో అంజలి కుమారి సింగ్‌, 60 కేజీల విభాగంలో ఆకాంక్ష సహా మెన్స్‌ 75 కేజీల విభాగంలో రాహుల్‌ ఫైనల్స్‌లో పోటీపడినా సిల్వర్‌ మెడల్స్‌తో సరిపెట్టుకున్నారు. అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం (ఐబీఏ)కు ప్రత్యామ్నాయంగా ఏర్పాటైన వరల్డ్‌ బాక్సింగ్‌ (డబ్ల్యూబి) నిర్వహించిన తొలి టోర్నమెంట్‌లోనే భారత్‌ ఆరు పతకాలు సాధించింది.