సూపర్ స్టార్ కష్ణ నటించిన చివరి చిత్రం ‘ప్రేమ చరిత్ర – కష్ణ విజయం’. అంబుజా మూవీస్, రామ్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై హెచ్.మధుసూదన్ దర్శక, నిర్మాతగా రూపొందిన ఈ చిత్రంలో యశ్వంత్, సుహాసిని జంటగా నటించారు. నాగబాబు, ఆలీ ముఖ్య పాత్రలు పోషించారు. శనివారం కష్ణ ద్వితీయ వర్ధంతి సందర్భంగా మేకర్స్ ఆయనకు ఘన నివాళి అర్పించారు. సంక్రాంతి కానుకగా జనవరి 3న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత మధుసూదన్ మాట్లాడుతూ,’కష్ణతో సినిమా రూపొందించడం అదష్టంగా భావిస్తున్నాను. ఆయన నటించిన ఆఖరు చిత్రం విడుదల కాని చిత్రాల జాబితాలో ఉండకూడదనే పట్టుదలతో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. ఆధునిక సాంకేతిక హంగులన్నీ అద్దుకున్న ఈ చిత్రం కష్ణ అభిమానులతోపాటు అందరినీ అమితంగా అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అని తెలిపారు. ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి సహ నిర్మాతలు బండ్రి నాగరాజ్ గుప్తా – బి.వెంకటేష్ శెట్టి – శ్రీపాద హన్ చాటే, కథ -స్క్రీన్ ప్లే – మాటలు – నిర్మాణం – దర్శకత్వం: హెచ్.మధుసూదన్.