నవభారత్ లో కృష్ణాష్టమి వేడుకలు

నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్ 

హుస్నాబాద్ పట్టణంలోని నవభారత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పాఠశాలలో బుధవారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు కృష్ణుడి, గోపికల వేషధారణలు వేశారు. పాఠశాలలో విద్యార్థులు ఉట్టి కొట్టారు. ఈ కార్యక్రమంలో  పాఠశాల డైరెక్టర్ గంగరవేణి రాజు, ప్రిన్సిపల్ వినీష్ , ఇన్చార్జి ఉపాధ్యాయురాలు జయ తదితరులు పాల్గొన్నారు.