నిబంధనలు పాటించని కృష్ణవేణి హై స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి

– ఎం.నరేంధర్ పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షుడు
నవతెలంగాణ – భీంగల్
నిబంధనలు పాటించని కృష్ణవేణి హై స్కూల్ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని  పీడీఎస్ యూ  జిల్లా అధ్యక్షుడు నరేందర్  విద్యాశాఖను డిమాండ్ చేశారు. భీంగల్ పట్టణ కేంద్రంలో  సీపీఐ ఎం.ఎల్ మాస్ లైన్ మండల కార్యదర్శి  రాజేశ్వర్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  కే టి ఎస్ పాఠశాల ప్రభుత్వ నిబంధనలు  పెడచెవిన పెడుతూ విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తుందని వారు  తెలిపారు ఒక వైపు విద్యాశాఖ నిబంధనలను తుంగలో తొక్కి కేవలం ఫీజులు దోపిడీ చేసే విధంగా ఉందని వారు అన్నారు. ఏప్రిల్ 8న జరిగిన బస్సు ప్రమాదం ఘటనపై నేటి వరకు విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటని వారు అన్నారు. ఈ స్కూలుకు చెందిన బస్సు అనేకమార్లు ప్రమాదానికి గురైన నేటి వరకు విద్యాశాఖ నుండి ఏమాత్రం చర్యలు కనిపించకపోవడం శోచనీయమని అన్నారు. అదే విధంగా బస్సు సీటు కెపాసిటీ తలపై మంది విద్యార్థులు తరలించాల్సిందిగా ఉంటే దానికి భిన్నంగా 80 నుండి 100 మంది విద్యార్థులను తరలించడం అటు మోటర్ వెహికల్ అధికారులు  చోద్యం చూస్తున్నారని వారు అన్నారు. అదేవిధంగా రూట్ పర్మిషన్ లేకుండా బస్సు ఫిట్నెస్ లేకుండా మరియు బస్సు గేర్ రాడు విరిగిపోవడం  జరిగిందని తెలిపారు ఈ ఘటన నుండి విద్యార్థులకు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారని వారు అన్నారు.  ప్రభుత్వ నిబంధనలను పక్కకు పెట్టి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఫీజులను వసూలు చేయడమే ధ్యేయంగా పనిచేస్తుందని వారు అన్నారు. తక్షణమే కృష్ణవేణి పాఠశాల గుర్తింపును రద్దుచేసి యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో కృష్ణవేణి పాఠశాల గుర్తింపు రద్దు చేసే వరకు ఉద్యమాలు జరుగుతాయని అటు అధికారుల మీద కూడా ఉద్యమం కొనసాగుతదని వారు హెచ్చరించారు. ఈ  సమావేశంలో పీడీఎస్ యూ నాయకులు హరీష్ ప్రణయ్ భారత్ సాయి చరణ్ రణప్రతాప్ వివేక్ కార్తిక్ వినయ్ చందు శ్రీను సిద్దు తదితరులు ఉన్నారు.