హెల్మెట్ ధరించి ప్రయాణించాలి : కేఆర్ఆర్

నవతెలంగాణ – దుబ్బాక రూరల్
రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ప్రతి వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరి ధరించాలని కేఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి అన్నారు. శనివారం దుబ్బాక మండలంలోని రఘోత్తంపల్లిలో గ్రామంలో సర్పంచ్, ప్రజాప్రతినిధులతో కలిసి ఉచిత హెల్మెట్ల పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ మాట్లాడుతూ.. గ్రామస్తులందరూ హెల్మెట్లను ఉపయోగించుకొని రోడ్డు ప్రమాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. బాధ్యతయుతంగా వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు నివారించిన వారవుతారన్నారు.మండలంలోని అన్ని గ్రామాల్లో హెల్మెట్ పంపిణీ చేపడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దేవిరెడ్డి, ఉప సర్పంచ్, ఎంపీటీసీ ,మాజీ ప్రజా ప్రతినిధులు , గ్రామస్తులు, యువకులుఉన్నారు