జర్మనీ చిన్నారికి కెఎస్‌జి స్పాన్సర్‌షిప్‌

KSG sponsorship for German childహైదరాబాద్‌ : జర్మనీ టెన్నిస్‌ సంచలనం, 8 ఏండ్ల చిన్నారి అరియా లాంక్రిసెంట్‌కు కెఎస్‌జి (కంకణాల స్పోర్ట్స్‌ గ్రూప్‌) స్పాన్సర్‌షిప్‌ ప్రకటించింది. ఎలక్ట్రికల్‌ బైక్‌ రేసింగ్‌ టీమ్‌ ఇండీ రేసింగ్‌, హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ ప్రాంఛైజీలు కెఎస్‌జిలో భాగం కాగా తాజాగా టెన్నిస్‌లోనూ అడుగుపెట్టారు. పదేండ్ల కాలానికి అరియాతో స్పాన్సర్‌షిప్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు కెఎస్‌జి యజమాని కంకణాల అభిషేక్‌ రెడ్డి తెలిపారు. ‘భారత్‌లో టెన్నిస్‌కు మంచి ఆదరణ ఉంది. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలకు ఐపీఎల్‌తో సమానంగా వీక్షణలు ఉంటాయి. అతి త్వరలోనే భారత్‌లోనూ టెన్నిస్‌కు ఊపు రానుంది. యూరోప్‌లో ఎంతో మంది జాతీయ కోచ్‌లతో సంప్రదింపులు అనంతరం అరియాకు స్పాన్సర్‌షిప్‌ నిర్ణయం తీసుకున్నాం. చిన్న వయసులోనే అరియాలో గొప్ప ప్రతిభ ఉంది’ అని అభిషేక్‌ తెలిపారు.