కేటీఆర్ దిశ బొమ్మ దగ్ధం 

KTR disha doll burntనవతెలంగాణ – మోర్తాడ్ 

జాతీయ రహదారి 63 బస్టాండ్ సమీపంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడానికి వ్యతిరేకిస్తూ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన కేటీఆర్ తక్షణమే తెలంగాణ మహిళ లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలు స్వాగతిస్తుంటే, కేటీఆర్ మహిళలను కించపరిచే విధంగా బస్సు సౌకర్యం ఉందటూ మహిళలను అవమానపరచ విధంగా మాట్లాడడం సరికాదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాములు అన్నారు. తెలంగాణ మహిళలోకం కేటీఆర్ కు గుణపాఠం చెప్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపి, మైపాల్ రేవంత్, సురేష్, శ్రీనివాస్, సంతోష్, భూమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.