ఏర్గట్ల మండలకేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బాల్కొండ కాంగ్రేస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో….కాంగ్రేస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా ముత్యాల సునీల్ రెడ్డి మాట్లాడుతూ… మహిళా సాధికారత మీద సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టి,వారిని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములను చేయాలని పాటుపడుతుంటే,యావత్ మహిళా లోకాన్ని కించపరుస్తూ..మహిళలందరూ వారి కుటుంబాలతో బ్రేక్ డ్యాన్సులు చేసుకోండని అవమానకర రీతిలో మాట్లాడడాన్ని నిరసిస్తూ… కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశామని అన్నారు.వెంటనే ఆయన తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని కాంగ్రేస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ మండలాధ్యక్షులు సోమదేవరెడ్డి, కాంగ్రేస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు శివన్నోళ్ళ శివకుమార్,నాయకులు ఆడేం గంగాప్రసాద్,గడ్డం జీవన్ రెడ్డి,ముస్కు మోహన్ రెడ్డి,బద్దం లింగారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.