నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మలేషియా తెలంగాణ అసోసియేషన్ (ఎంవైటీఏ) దశాబ్ది ఉత్సవాలు ఈ నెల 9న జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి , ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గాదరి కిశోర్ కుమార్, బాల్క సుమన్ , పార్టీ ప్రతినిధులతో కలిసి హాజరుకానున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో మలేషియాలోని ఈ అసోసియేషన్‌ను ఏర్పాటు చేసుకోగా, దాన్ని మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.తిరుపతి కేటీఆర్‌ను ఆహ్వానించారు.