కేరళ టైకాన్‌ సమ్మిట్‌కు కేటీఆర్‌కు ఆహ్వానం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
టైకాన్‌ కేరళ-2024 సమ్మిట్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. డిసెంబర్‌ 4, 5 తేదీల్లో కోచీలోని గ్రాండ్‌ హయత్‌ హౌటల్‌ వేదికగా 13వ ”ది ఇండస్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ కాన్ఫరెెన్స్‌ సమ్మిట్‌” జరుగనున్నది. ‘మిషన్‌ 2030- ట్రాన్స్‌ఫార్మింగ్‌ కేరళ’ థీమ్‌తో జరగనున్న ఈ సమ్మిట్‌కు వివిధ రంగాలకు చెందిన కంపెనీల సీఈవోలు, స్టార్టప్‌ వ్యవస్థాపకులు, పరిశ్రమల నిపుణులు వెయ్యిమందికిపైగా హాజరవనున్నారు. డిసెంబర్‌ 5న సాయంత్రం జరిగే సమ్మిట్‌ ముగింపు వేడుకలకు హాజరు కావాలని టైకాన్‌ చైర్మెన్‌ వివేక్‌ కీష్ణగోవింద్‌ కేటీఆర్‌ను ఆహ్వానించారు.