– కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
అధికారం కోల్పోయిన తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్ ఎద్దేవా చేశారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…బెదిరింపు రాజకీయాలకు భయపడే వాళ్ళం కాదన్నారు.పది సంత్సరాలు ప్రతిపక్షంలో ఉండి మీతో కొట్లాడినోళ్ళం.. మీ తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్ళం కాదన్నారు.అధికారులపై, పోలీసులపై అజమాయిషీ చెలాయిస్థమని.. వాళ్ళను కూడా తిట్టడం హేయమైన చర్య అన్నారు.లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి చేసినట్లు ఇక్కడ కూడా చేస్తమన్నట్లు కనిపిస్తుంది..కేటీఆర్ మాటలు ఐదు సార్లు ఎమ్మేల్యేగా గెలిచినా కేటీఆర్..ఇక్కడ సంపద దోచుకొని రూ.5వేల కోట్లను దోచుకున్నాడని ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నీడను కూడా తాకలేరని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు లింగాల భూపతి, ప్రెస్ క్లబ్ అడక్ కమిటి కన్వీనర్ పూర్మాని లింగా రెడ్డి, రాజశేఖర్, మార్కెట్ డైరెక్టర్లు కళ్లేపల్లి తిరుపతి రెడ్డి, పొన్నాల పరుశురాం,ఆరెపల్లి బాలు,మండల నాయకులు శ్రీకాంత్ గౌడ్, బైరి నేని రాము,మునిగాలా రాజు, కొత్త రవి,ఎగుర్ల ప్రశాంత్,కోల శంకర్,భరత్, చిలుక శ్రీను, చంద పాల్గొన్నారు.