నిరుద్యోగులపై ప్రభుత్వ నియంతృత్వం : కేటీఆర్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
విద్యార్థుల శాంతియుత నిరసనపై ప్రభుత్వం నియంతృత్వంతో వ్యవహిరించిందని బీఆరఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శుక్రవారం ఒక ప్రకటలో విమర్శించారు. విద్యార్థుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. అరెస్టు చేసిన విద్యార్థి సంఘాల నాయకులను, నిరుద్యోగులను, యువకుల ను భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులకు బీఆర్‌ఎస్‌ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. ఉద్యోగాల భర్తీ, గ్రూప్స్‌ నోటిఫి కేషన్లలోని సమస్యలు, జాబ్‌ క్యాలెండర్‌ వంటి అంశాల పైన టీజీపీఎస్సీ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపి, ప్రభుత్వాని కి తమ డిమాండ్లను తెలియ జేయాలను కున్న విద్యార్థి నాయకుల ను అరెస్టు చేయడ ం దుర్మార్గమని తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్‌ చెప్పిన జాబ్‌ క్యాలెండర్‌ తేదీల గడువు అయిపోయిందనీ, వెంటనే ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులు చేస్తున్న అన్ని నిరసన కార్యక్రమాలకు భారత రాష్ట్ర సమితి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అరెస్టు చేసిన విద్యార్థి నాయకులు నిరుద్యోగులు విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాల ని కేటీఆర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.