
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు మహిళలను ఉద్దేశించి చేసిన వాక్యాలు ఆయన అహంకారానికి నిదర్శనమని సభ్య సమాజం తలదించుకునేలా కేటీఆర్ వాక్యాలు ఉన్నాయని బి జె పి అసెంబ్లీ మహిళా మోర్చా కన్వీనర్ స్వభావిక గౌడ్ శుక్రవారం తెలిపారు. ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే వారంతా పేద ,మధ్యతరగతి మహిళలే అని, డబ్బుందని అహంకారంతో కేటీఆర్ పేద మధ్యతరగతి మహిళలను అవమానిస్తున్నాడని, ముఖ్యంగా మహిళల విషయంలో అధికారంలో ఉన్నప్పుడు ఒకరకంగా ఇప్పుడు మరొక రకంగా మాట్లాడడం అలవాటుగా మారిందని అన్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ముక్కు నేలకు రాసి బహిరంగ క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో కేటీఆర్ ను బయట తిరగనియ్యమని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వారిపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినారు.