నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సురేష్ యాదవ్‌పై దాడి చేసిన కాంగ్రెస్ గూండాలపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు డీజీపీని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. హామీ ఇచ్చి దళిత బంధు విడుదల చేయని కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తే, సిగ్గులేకుండా సురేష్ యాదవ్‌పై దాడి చేశారని తెలిపారు. గురువారం సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆస్పత్రిలో సురేష్ యాదవ్‌ను పరామర్శించారనీ, త్వరలోనే తాను తుంగతుర్తిని సందర్శించి సురేష్‌తో సమావేశమవుతానని కేటీఆర్ తెలిపారు.