– సీఎం ఉసరి వెళ్లి మాటలు తప్ప హామీలు అమలు చేయాలే
– మతం పేరిట రాజకీయం చేసుడు తప్ప అభివృద్ది చేయలేదు బండి సంజయ్ కుమార్
నవతెలంగాణ – వీర్నపల్లి
అరు గ్యారంటీ లు అములు చేస్తానని చెప్పి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఉసరా వెళ్ళీ మాటలు మాట్లాడుతుడని మాజి మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వన్ని విమర్శించారు. వీర్నపల్లి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం లో భాగంగా బి అర్ ఎస్ పార్టి ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, బి అర్ ఎస్ పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై మాట్లాడుతు ముందుగా నన్ను నాలుగు నెలల క్రితం ఎమ్మేల్యేగా గెలిపించారు. మన మందారం కేసీఅర్ మూడో సారి ముఖ్య మంత్రి అయితడు పెద ప్రజలకు న్యాయం జరుగుతుందనీ అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అరచేతుల్లో వైకుంఠం చూపిట్టిందో దాని నమ్మి ప్రజలు మోసపోయారు. ఊరికి ఊరికి బ్యాంకు లకు వెళ్లి రుణాలు తెచ్చుకోరి రెండు లక్ష ల ఋణ మాఫీ చేస్తానని చెప్పి నాలుగు నెలల అయినా అరు గ్యారంటీ లు అమలు చేయలేదన్నారు . నోటికొచ్చిన మాటలు చెప్పిండు సిగ్గు లేకుండా చెపుతుండు. రేవంత్ రెడ్డి ఐదు గ్యారంటీ లు అములు చేశామని మాట్లాడుతున్నారు. అడ బిడ్డలకు, స్కూటీ ఇస్తా, రైతు బరోసా ఇస్తానని ఐదు గ్యారంటీ లు అమలు చేసినా అని మాట్లాడుతున్నాడు . ఇష్టం వచ్చినట్లు ముఖ్య మంత్రి హోదా మరిచి దౌర్భాగ్యపు చండలమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఒక్క రూపాయి రాలే, ఋణ మాఫీ కాలే, నాలుగు నెలల లో లక్ష పెళ్ళిలు అయినాయి రాష్ట్రంలో జరిగితే వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష రూపాయలు తులం బంగారం వచ్చిందా ప్రభుత్వం కాంగ్రెస్ తులం బంగారం బాకీ ఉందన్నారు. ఇంట్లో ఎందురు ఉంటే అందరికి అత్త ,కొడలుకు ఇద్దరికీ పెన్షన్ ఇస్తానని చెప్పి జనవరి నెల పెన్షన్ లను ప్రభుత్వం ఎగ్గొట్టిందన్నారు. అరచేతిలో వైకుంఠం చూపి గద్దెనెక్కి. రెండు లక్షల రుణ మాఫీ అన్నాడు రుణ మాఫీ కాలేదు. పోడు భూముల పట్టాలు ఇచ్చాము. రైతు బందు కుడా ఇచ్చాం. కాంగ్రెస్ ఆదివాసీ, గిరిజన ల పోడు భూముల రైతులకు ఒక్కరికి కూడ రైతు బందు పడలేదు. ఇది వాస్తవం దయచేసి ఆలోచించండి. అరచేతుల్లో వైకుంఠం చూపెట్టిండు మోచేతికి బెల్లం పెట్టిండు నాకు మన్నడు. గద్దెనెక్కిండు. అవుతాల పడ్డాడు. సిగ్గు లేకుండ ఇగిలిస్తుండు లంకె బిందెలు ఉంటాయని వచ్చిన ఈడ కాళీ కుండలు ఉన్నాయని అంటున్నాడు. లంకె బిందెలు కోసం కోసం గడ్డపార తట్ట పార పట్టుకొని అర్థరాత్రి ఎవ్వరు తిరుగుతారు గసొంటోడు మన ముఖ్యమంత్రి గిట్లండు . ఈ ముఖ్య మంత్రి ఉసర వెళ్లి కదా రంగులు మార్చినట్లు మర్చుతుండు. మొదట అన్నాడు డిసెంబర్ 9న రుణ మాఫీ చేస్తానన్నాడు . ఇప్పుడు ఏమో రాష్ట్రంలో పేమస్ గుడులు ఎక్కడ ఉంటే అక్కడ అక్కడ దేవుండ్ల మీద ఒట్టు పెడుతున్నాడు. నేను అడిగిన మీ భార్య పిల్లల మీద ఒట్టు పెట్టుకోమని గప్పడు చప్పుడు చేయలేదన్నారు. ఒక్కటీ అంటే ఒక్కటే పెట్టిండు ప్రీ బస్సు పెట్టీ బస్సులో అడ బిడ్డలకు లొల్లి పెట్టాడు. రంగం పేటలో ఉన్న రైతుల సమస్యలను ఎలక్షన్ కాగానే అన్ని గ్రామాలలో రైతులకు పట్టాలు అందిస్తా , అడవి పదిర భూముల సమస్యను అన్నీ పరిష్కరిస్తామన్నడూ. వీర్నపల్లి మండలాన్ని చేసిందే కేసీఅర్ తండాలను గ్రామ పంచాయితిలుగా, తండాలుగా , గిరిజనులకు రిజర్వేషన్ పెంచినాం, కరేంట్ మంచిగా చేసినం అన్ని రకాలుగా అభివృద్ది చేసింది కేసీఅర్ అన్నాడు.కాంగ్రెస్ తోని పార్లమెంట్ లా పోటీ లేదు నాకు తెలిసి . అన్న నువ్వు ఎమూ చేసునావు అంటే వీర్నపల్లి లో స్వంత డబ్బుల తొని రైతు వేదిక కట్టించిన, గ్రామాలలో సిసి రోడ్లు, స్కూల్ కట్టించిన, వీర్నపల్లి కి ఎన్ని సార్లు బండి సంజయ్ గెలిచినాక వచ్చాడ , వీర్నపల్లికీ ఒక్క రూపాయి అయిన పని చేసిండా, ఎందుకు ఓటు వేయాలి అంటే జై శ్రీరామ్ , రాముడి గుడి కట్టింనందుకు ఓటు వేయాలని అంటుండు బండి సంజయ్. మనం కూడ నాలుగు ఎండ్ల క్రింద నే కేసీఅర్ యాదాద్రి గుడి కట్టించాడు. ఆధునిక దేవాలయాలు కట్టినాడు కేసీఅర్ ఆధునిక దేవాలయాలు అంటే చెరువులు , కుంటలు కాలువలు నదులు కట్టించాడు. నదులకు చెరువుల కు బ్యారేజి లకు కూడ దేవుండ్ల పేరు పెట్టిండు కేసీఅర్ సరస్వతి బ్యారేజి, రాజరాజేశ్వర సాగర్, కొండ పోచమ్మ, లక్ష్మీ బ్యారేజి, అన్న పూర్ణ బ్యారేజీ ఒక్క గుడి కట్టించినందుకు బండి సంజయ్ ఓటు వేయమంటే కేసీఅర్ ఇన్ని గుడులు కట్టించిన కేసీఅర్ కు ఎన్ని ఓట్లు వేయాలన్నారు. అదే విదంగా మతం పేరిట మాట్లాడుతున్నాడు.
శ్రీరాముడు అందరివాడు శ్రీ రాముడు దేవుడు శ్రీ రాముడు ఏమి చెప్పిండు రాజధర్మం పాటించుమన్నాడు. అందరిని ఒక్కటే తిరిగా చూడు మన్నాడు. మోడీ స్వంత రాష్ట్రం గుజరాత్ మన తెలంగాణ ను ఒక్కటే రితిగా చుడాలేగాని, లక్ష కోట్లు నిధులు గుజరాత్ రాష్ట్రానికి మన తెలంగాణ రాష్టానికి ఒక్క రూపాయి ఇయ్యలేదు . ఒక్క స్కూల్ , కాలేజీ కట్టివ్వ లేదు. అయిదు ఎండ్ల లో అభివృద్ది చేయలేదు బండి సంజయ్ అయిదు ఎండ్లు గాలి తిరుగుడు తప్ప గాలి మాటలు మాట్లాడిన తప్ప ఒక్కటి కుడా స్కూల్ తెలంగాణలో కట్టలేదు . బండి ఏమీ చెప్పిండు అన్న ఇయ్యాల ఎమూ వారం అంటాడు క్యాలెండర్ కొన్నుకొంటే అదే చెపుతది. మసీదు కులగొడుదాం అందులో శివం ఎల్లుతే మాది శవం మీది అంటాడు. తవ్వితే ఎమూ తవ్వలే పునాదులు తవ్వలే ప్రాజెక్టులు కట్టాలి, స్కూల్ లు కట్టాలి, కాలేజీ లు కట్టాలి, కాలువలు తియ్యాలి, బంజర్ భవన్, సేవాలాల్ మహారాజ్ గుడి కట్టాలి కాని అవేవీ కట్టకుండా గాలి మాటలు తప్ప గాలి తిరుగుడు తప్ప, సిరిసిల్ల, వీర్నపల్లిలో గంభిరావు పేటలో, ముస్తాబాద్ లో ఎమూ చేసిండు బండి సంజయ్ ఒక్కటీ కూడ సక్కదనం మాటలేదన్నారు.మోడీ సం రాణికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్ అన్నాడు. నిత్య అవసర సరుకులు పిరం చేసిందే మోడీ మోడీ ప్రధాన మంత్రి అయిన పెట్రోల్ డీజిల్ పై పన్నులు వేసిండు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి.సెస్ పేరు మీద ముపై లక్ష కోట్లు వసూలు చేసిండు ఏడాదికి 14 లక్ష కోట్లు పెద్ద పెద్ద అదని అంబానీ లకు పెట్టిండు వాల్ల్ ఋణ మాఫీ చేసిండు. మతం పేరిట రాజకీయం చేసిన అందుక బీజేపి కి ఓటు వేయాల, అన్నీ రెట్లు పెంచినందుక నిత్య అవసర సరుకులు రెట్లు పెంచినందుకా బిజేపి ఓటు వేయాల బీజేపి ప్రభుత్వం పై మండి పడ్డారు. మళ్ళ మంచి రోజులు రావాలి అంటే అడ బిడ్డలకు, రైతులకు సంతోషంగా ఉండాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపి లకు కర్రు కాల్చి వాత పెట్టీ కరీంనగర్ పార్లమెంటు సభ్యుడుగా బొయిని పల్లి వినోద్ కుమార్ భారీ మెజార్టీ గెలిపించాలని కేటీఆర్ అభ్యర్థించారు. బిఎస్పి పార్టి ని విడి నుంచి బి అర్ ఎస్ పార్టి లో చేరారు. యువకులను పార్టి కండువా కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే కెటిఆర్ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాఫ్కబ్ ఛైర్మెన్ రవీందర్ రావు, బి అర్ ఎస్ పార్టి జిల్లా అధ్యక్షులు అగయ్య, ఎంపిపి భులా, జెడ్పీ టి సి కళావతి, సెస్ డైరెక్టర్ మల్లేశం, జెడ్పీ కో ఆప్షన్ చాంద్ పాషా, బి అర్ ఎస్ పార్టి మండల అధ్యక్షులు రాజిరెడ్డి, మహిళ అధ్యక్షురాలు కళా, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.