ఎన్నికల తర్వాత కేటీఆర్‌ జైలుకే

– మరిన్ని కుంభకోణాలు బయటపడతారు
– ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ
నవతెలంగాణ-కామారెడ్డి
లోక్‌సభ ఎన్నికల తర్వాత కేటీఆర్‌ జైలుకు వెళ్తారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ అన్నారు. కామారెడ్డి లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో చాలామంది జైలుకు వెళ్తారనీ, ఫోన్‌ ట్యాపింగ్‌లో భార్యాభర్తలు మాటలు వినడం సిగ్గుచేటు అని అన్నారు. ఎంపీ ఎన్నికలు కాగానే కేటీఆర్‌తో పాటు మరికొంత బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు.గత ఎన్నికలలో బీఆర్‌ఎస్‌ పార్టీ పోలీస్‌ ఉన్నత అధికారుల పర్య వేక్షణలో పోలీసు వాహనాలలో డబ్బులు తరలించడం సిగ్గుచేటు అన్నారు .పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ కనుమరుగువు తుందన్నారు.10 సంవత్సరాలు బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉండి రైతుల ను పట్టించుకోలే దన్నారు.కానీ ఇప్పుడు రైతుల పట్ల మొసలి కన్నీళ్లు కారుస్తున్న దనీ, రైతుల పండించిన ప్రతీ గింజ కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.