
మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లలిత నగర్ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక పరిశ్రమల శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారీ కేకును కట్ చేసి కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దిప్ లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి, ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భూపేష్ గౌడ్, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులు పాల్గొన్నారు.