తాడ్వాయి లో ఘనంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు

నవతెలంగాణ -తాడ్వాయి
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు 47వ పుట్టినరోజు వేడుకలను  సోమవారం బిఆర్ఎస్ తాడ్వాయి మండల పార్టీ అధ్యక్షుడు మల్లయ్య అధ్యక్షతన బిఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర‌ కీర్తి ని ప్రపంచవ్యాప్తంగా చాటిన ఘనత కేటీఆర్ ది అన్నారు. ఎన్టీఆర్ ఆలోచన విధానాలతో రాష్ట్రంలో అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందన్నారు. గాడ్ ఆఫ్ తెలంగాణ కెసిఆర్, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ యూత్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ డేగల సలేందర్, జిల్లా నాయకులు పత్తి గోపాల్ రెడ్డి, సర్పంచులు పుల్లూరి గౌరమ్మ, జాజ చంద్రం, నాగేశ్వరరావు, మాజీ మండల అధ్యక్షులు బండారు చంద్రయ్య, ముండ్రాతి రాజశ్రీ, నూశెట్టి రమేష్, ఇంద్రారెడ్డి, పోగు నాగేష్, చల్ల రజినికర్ రెడ్డి, సల్లూరి లక్ష్మణ్, విక్రమ్, జైపాల్ రెడ్డి, ముండ్రాతి శ్రీనివాస్, వసంతరావు, బందెల తిరుపతి, మంకిడి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.