జయశంకర్‌ విగ్రహం ధ్వంసంపై కేటీఆర్‌ ఆందోళన

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
శేరిలింగంపల్లి ఆల్విన్‌ కాలనీలో పోలీసుల ముందే ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహాన్ని పగలగొట్టిన సంఘటనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కే తారకరామారావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్యకు పాల్పడిన వారిపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని కోరారు. తెలంగాణ సమాజమంతా గౌరవించుకునే ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహం ధ్వంసం చేయడం అత్యంత హీనమైన చర్య అనీ, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.