కేటీఆర్ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి 

KTR's inappropriate comments on women should be withdrawn– హుస్నాబాద్ లో  కాంగ్రెస్ నాయకుల నిరసన 

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
మాజీ మంత్రి కేటీఆర్ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న మహిళలపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నిరసిస్తూ శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మహిళలను చిన్నచూపు చూస్తున్న కేటీఆర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు కేడం లింగమూర్తి , సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మండల అధ్యక్షులు బంక చందు, వెన్న రాజు, బూరుగు కృష్ణస్వామి, చిత్తారి రవీందర్ పద్మ, కోమటి సత్యనారాయణ, హక్కు శ్రీనివాస్, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.