అబద్ధాల పునాదులపై కేటీఆర్, కవిత రాజకీయ పుట్టుక

– పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
నవతెలంగాణ – కంటేశ్వర్
అబద్దాల పునాదుల పైననే కేటీఆర్ కవితల రాజకీయ పుట్టుక ఉందని టీపీసీసీ కార్యనిర్వాక అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు గురువారం కాంగ్రెస్ భవన్ నందు పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా టిపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ డబ్బు అహంతో మాట్లాడుతున్నాడని, అతి తక్కువ సమయంలో 9 సంవత్సరాల పాలనలో అత్యంత ధనవంతుడిగా ఎదిగిన కుటుంబం కేవలం కేసీఆర్ కుటుంబమని, తొమ్మిది సంవత్సరాలుగా ఏమి సాధించారని ఉత్సవాలు జరుపుకుంటున్నారని ప్రశ్నించారు. కర్ణాటక ఫలితాలే తెలంగాణలో పునరావృతం అవుతాయని ఎందుకంటే కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజల నడవడి ఒకే విధంగా ఉంటుందని కర్ణాటక రాష్ట్రంలో ప్రజల డబ్బును ప్రతి ప్రాజెక్టులో 40% కమిషన్ తో దోచుకున్న బిజెపి ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపించారని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గుడిని గుడి లింగాన్ని మింగినట్టు ప్రతి ప్రాజెక్టులో 50 నుండి 60% కమిషన్ తీసుకుంటున్న టిఆర్ఎస్ పార్టీని ప్రజలు ఇంటికి పంపుతారని ఆయన అన్నారు.కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరని కేటీఆర్ అడుగుతున్నాడని ,టిఆర్ఎస్ అనేది కేవలం కుటుంబ ప్రాంతీయ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఆదరణ పొందిన వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ఉంచుతుందని ఆయన అన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ దేశ రాజకీయాలు చేస్తే రాష్ట్రంలో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్తున్నాడని అలా అయితే కెసిఆర్ కు ఉద్యమ సమయంలో ముందుండి నడిపించిన హరీష్ రావు పరిస్థితి ఏంటి అని, టిఆర్ఎస్ పార్టీలో ఉన్న గొడవలను ముందు కేసీఆర్ చూసుకోవాలని ఆయన అన్నారు.బిఆర్ఎస్ పార్టీ తీసుకు వచ్చిన ధరణి పోర్టల్ ద్వారా పేదవాళ్లకు నష్టం జరిగి భూస్వాములు లాభం పొందుతున్నారని, కావున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ను ప్రక్షాళన చేస్తామని, 9 సంవత్సరాలుగా రైతు రుణమాఫీ చేయడం లేదని రైతులు ఎవరు బ్యాంకులలో రుణాలు కట్టాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ఆయన అన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వడానికి భూమి లేదని ,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు స్థలాలు లేవని కానీ టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చి గల్లీ నుండి ఢిల్లీ దాకా ప్రభుత్వ స్థలాలను కేసీఆర్ దోచుకుంటున్నాడని ఆయన అన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దోపిడీకి గురైన ప్రభుత్వ భూములను తిరిగి ప్రభుత్వ పరం చేస్తామని, సెక్రటేరియట్, అమరవీరుల స్తూపంలో జరిగిన అవినీతిని నిపుణుల చేత కమిటీ వేసి బయటకు తీస్తామని ఆయన అన్నారు. జిల్లాలో టిఆర్ఎస్ కు సంబంధించి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉండి జిల్లాకు చేసిందేమీ లేదని ,మెడికల్ కాలేజ్ ,తెలంగాణ యూనివర్సిటీ, సెజ్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినవని ,కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటుందని దానికి ఉదాహరణగానే తెలంగాణ రాష్ట్రం ఇచ్చామని, రాజస్థాన్లో మహిళలకు 500 రూపాయలకే వంటగ్యాస్ అందిస్తున్నామని, చత్తీస్గడ్ రాష్ట్రంలో 2500 రూపాయలకు వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ఆయన అన్నారు. జిల్లాలో సుదర్శన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు గుత్ప, ఆల్లి సాగర్, హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకాలు ,నిజం సాగర్ ఆధునీకరణ జరిగాయని, ప్రస్తుతం తెలంగాణ యూనివర్సిటీలో అవినీతి జరుగుతుంటే దానిని టిఆర్ఎస్ మంత్రి ఎమ్మెల్యేలు ఆపలేకపోతున్నారని ఆయన అన్నారు. మరో ప్రక్క బీజేపీ దేవుని పేరుతో మత రాజకీయాలు చేస్తుందని, కాంగ్రెస్ నాయకులు కూడా దేవుళ్లను పూజిస్తారు అని కానీ దేవుడి పేరు మీద ఓట్లు అడగరని, స్థానిక ఎంపీ అరవింద్ రైతులకు పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చి ఇప్పుడు పసుపు బోర్డు తీసుకురాకుండా మాట తప్పడని, రైతులకు క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని, మొదటి ఏడాదిలోని రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, వరి పంటను 2500 రూపాయల మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని, ఇల్లు లేని పేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు అందిస్తామని, 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిలు కాలేజీకి వెళ్లడానికి ఎలెక్ట్రిక్ స్కూటర్ అందిస్తామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేశ వేణు, మాజీ బీసీ సెల్ అధ్యక్షులు శేఖర్ గౌడ్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పగంగారెడ్డి ,ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు వేణు రాజ్, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజ నరేంద్ర గౌడ్ ,జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ జావేద్ అక్రమ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్ ,పిసిసి డెలిగేట్ ఈసా, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రామకృష్ణ, నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రీతం,బాలయ్య , మజీద్ తదితరులు పాల్గొన్నారు.