నవతెలంగాణ – భీంగల్
భీంగల్ పట్టణ కేంద్రంలోని కృష్ణవేణి పాఠశాల కు చెందిన బస్సు చెట్టుకు ఢీకొనడంతో బస్సులోని విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సోమవారం ఉదయం మండలంలోని కారేపల్లి, రహత్ నగర్ గ్రామాల నుండి విద్యార్థులను రోజు మాదిరిగానే ఉదయం పాఠశాలకు తీసుకువస్తుండగా కారేపల్లి ఘాట్ వద్ద బస్సు యొక్క స్టీరింగ్ గుట్కా విరిగిపోవడం చెట్టుకు ఢీకొనడంతో బస్సులోని విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి . దీంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఘటన స్థలానికి చేరుకొని ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాద ఘటనను తెలుసుకున్న బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రమాద ఘటనపై స్థానిక నాయకులతో మాట్లాడి విద్యార్థుల తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని కోరారు. బస్సులో 50 మందికి పైగా విద్యార్థులను సమాచారం.