నవతెలంగాణ – తొగుట
ప్రాజెక్టుల నుండి నీళ్ళు విడుదల చేసి కరువు నుండి రైతులను కాపాడాలని దుబ్బాక ఎమ్మెల్యే, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం మండ లంలోని జప్తి లింగారెడ్డి పల్లి గ్రామంలో ఎమ్మెల్యే సహకారంతో ఏర్పాటు చేసిన నూతన వాటర్ ప్లాంట్ ను ప్రారంభించి, గ్రామ ప్రజలకు వాటర్ క్యాన్లు, చెత్త బుట్టలను పంపిణీ చేశారు. అనంత రం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో అలివి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వొచ్చిన రేవంత్ సర్కార్ తెలంగాణ ప్రజలకు డోఖా చేసిందని ఆరో పించారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రాజెక్టులలో పుష్కలంగా నీళ్లు ఉండేవని, కూడవెల్లి వాగు నిండు కుండలా ప్రవహించేదన్నా రు. ప్రాజెక్టు ద్వారా రామయంపేట, దుబ్బాక ప్రధా న కాలువల ద్వారా చెరువు, కుంటలు నిండు కుండల ఉండేవన్నారు. కేసీఆర్ మీద కక్ష కట్టి కాళేశ్వరం ప్రాజెక్టు పేరున దుష్ప్రచారం చేస్తున్నా రని మండిపడ్డారు. ప్రాజెక్టులో సమస్య వొస్తే కాఫర్ వాల్ ఏర్పాటు చేసి నీటిని పైకి తరలించాలన్నారు. ఈ సంవత్సరం వర్షాభావం పరిస్థితులు ఏర్పడుతు న్నాయని, నార్లు ముదిరి పోతున్నా రైతులు నాట్లు వేసే పరిస్థితులు లేవన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కూడ వెల్లి వాగుతో పాటు దుబ్బాక, రామయంపేట ప్రధా న కాలువల ద్వారా నియోజకవర్గంలోని వాగు వంకలు, చెరువు కుంటలను నింపాలన్నారు.
కేసీఆర్ రైతుబంధు ద్వారా ఎకరాకు ఏడాదికి రూ. 10 వేలు ఇస్తే, రైతు భరోసా ద్వారా రూ. 15 వేలు ఇస్తామని గొప్పలు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం రైతు లకు పెట్టుబడి సహాయం ఇంతవరకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, విద్య, ఆరోగ్య వ్యవస్థలు అగమై పోయాయన్నారు. నాడు రేవంత్ రెడ్డి సర్కారు కోసం పనిచేసిన నిరుద్యోగులు నేడు నిజం తెలుసుకొని పోరాటం చేస్తున్నారన్నారని చెప్పారు. వర్షాకాలంలో కలుషిత నీటి ద్వారా జబ్బుల బారిన పడే అవకాశం ఉందని, సురక్షిత తాగునీరు సేవించాలని గ్రామ ప్రజలకు సూచిం చారు. అనంతరం ఇటీవల పిడుగుపాటుకు గురై మరణించిన కడారి శ్రీశైలం కుటుంబాన్ని పరా మర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, ఏఎస్ఐ రాంరెడ్డి మాజీ మండల పార్టీ అధ్యక్షుడు చిలువేరి మల్లారెడ్డి, మాజీ మార్కె ట్ కమిటీ చైర్మన్ బక్క కనకయ్య, మండల యూత్ అధ్యక్షుడు మాదాసు అరుణ్ కుమార్, గ్రామ పార్టీ అధ్యక్షులు చిలువేరి రాజిరెడ్డి, తగరం అశోక్, చెరు కు లక్ష్మా రెడ్డి, నాయకులు సుతారి రమేష్, మంగ నర్సింలు, మంగ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.