ఎన్‌కోర్‌-ఆల్కమ్‌ సీఎండీకి ప్రశంసలు

ఎన్‌కోర్‌-ఆల్కమ్‌ సీఎండీకి ప్రశంసలు–  ఆకర్షిస్తున్న సంస్థ ఉత్పత్తులు
హైదరాబాద్‌ : నగరంలోని హైటెక్స్‌ వేదికగా జరుగుతున్న ఏస్‌టెక్‌ ట్రేడ్‌ ఫెయిర్‌లో ఎన్‌కోర్‌-ఆల్కమ్‌ ఉత్పత్తులు ఆకటు ్టకుంటున్నాయి. ఆ సంస్థ స్టాల్‌ను శనివారం అదానీ పోర్ట్స్‌, లాజిస్టిక్స్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌ ఎపి, తెలంగాణ హెడ్‌ పి అంజి రెడ్డి, రిలయన్స్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌ ప్రతినిధి రవినాథ్‌ రెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా వారు ఎన్‌కోర్‌-ఆల్కమ్‌ ఫౌండర్‌, సిఎండి అవుతు శివ కోటి రెడ్డి, ఆల్కమ్‌ డైరెక్టర్‌ జయంతి భారు మనుభారు, ఎన్‌కోర్‌ డైరెక్టర్లు అవుతు పవన్‌ కుమార్‌ రెడ్డి, శ్రీ హర్షను వారు అభినందించారని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. స్టాల్‌ లో 1.8 టన్నుల బరువున్న 18 అడుగుల ఎత్తైన విండోను ప్రదర్శిస్తున్నామని అవుతు శివ కోటి రెడ్డి తెలిపారు. కంపెనీ తయారు చేస్తున్న విభిన్న, వినూత్న ఉత్పత్తులు ఇక్కడ కొలువుదీరాయన్నారు.