దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ ఉత్తర్వులతో మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వాహణాధికారిగా ఆదివారం బాధ్యతలు చేపట్టిన ఎస్ మహేష్ ను సోమవారం మండలంలోని ఇప్పలపల్లి గ్రామ మాజీ ఉప సర్పంచ్ శనిగల శ్రావణ్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోడారి చిన మల్లయ్య యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో ఘనంగా సన్మానించారు.