
మండలంలోని నాలేశ్వర్ గ్రామపంచాయతీ పాలకవర్గానికి బినోల సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మాన్లు, వీడిసి సభ్యులు మంగళవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మాన్లు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా సర్పంచ్ సరిన్ తో పాటు పాలకవర్గం ఒక కుటుంబంలాగా ఉంటూ గ్రామ ప్రజలకు సేవలందించారని వారి సేవలకు ఉత్తమ పంచాయతీగా అవార్డు దక్కడం గ్రామ ప్రజలందరికీ గౌరవ ప్రదమని అన్నారు. అనంతరం పాలకవర్గానికి మెమొంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్యామల, వీడిసి సభ్యులు సురేష్, రాజేశ్వర్, సుధాకర్, నవీన్, కార్యదర్శి ప్రియాంక, కారోబార్ భుజంగరావు తదితరులు ఉన్నారు.