‘పచ్చని కొమ్మపై
ఉయ్యాలూగే కోయిలా..
నన్ను చూడగానే పాడవేం’
పాప చిలిపి ప్రశ్న
‘అబ్బా! ఆశ దోశ అప్పడం’
కోయిల కవ్వింత
చూసీ చూడనట్టు
‘నీవు పాడకపోతే
నేనలుగుతా’
నా బుంగమూతి చూడు.
కుహూ! కుహూ! కుహూ!
భలే! భలే! భలే!
నీది పాటా – నవ్వా!
‘నవ్వులాంటి పాట’
నేనూ నీలాగే
కావాలంటే చూడు.
కుహూ! కుహూ! కుహూ
‘నేనూ తగ్గేదేలే’
కుహూ! కుహూ! కుహూ!
– కె.శాంతారావు, 9959745723