భువనగిరి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం : కుంభం

నవతెలంగాణ- వలిగొండ రూరల్ : ఈ నెల 30 న జరుగనున్న శాసన సభ ఎన్నికల్లో భువనగిరి గడ్డపై కాంగ్రెస్ పార్టీ జండా ఎగురవేస్తామని కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థి కుంభం అని కుమార్ రెడ్డి అన్నారు.గురువారం మండలంలోని మాందాపురం, సుంకిశాల, పులిగిల్ల గ్రామాలలో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికీ  ప్రచారం నిర్వహించి ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 హామీలను వివరిస్తూ బిఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు చేసిందేమి లేదని , కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు సక్రమంగా నెరవేర్చలేదని, బిఆర్ఎస్ పార్టీ, బిజెపి పార్టీ వారు చెప్పే కల్ల  బొల్లి మాటలు నమ్మొద్దని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు ఐన వెంటనే ఈ ప్రాంత విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వ డిగ్రీ కళాశాల తీసుకు వస్తానని అన్నారు.పేదలకు అభివృద్ధి సంక్షేమ  పథకాలను అందే విధంగా చార్జి తీసుకుంటామని అన్నారు,వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చేతి  గుర్తుకు అత్యధిక ఓట్లు వేసి  తనను ఎమ్మెల్యే గా  భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఎంపిపి నూతి రమేష్ , వాకిటి అనంత  రెడ్డి, పాశం సతి రెడ్డి, బెలిద నాగేశ్వర్, బాతరాజు బాల నర్సింహా, తుమ్మల యుగంధర్ రెడ్డి,బోళ్ల శ్రీనివాస్, పబ్బు ఉపేందర్ బోస్ , చిలుకూరి సతి రెడ్డి,కుంభం విద్యాసాగర్ రెడ్డి, వెంకట పాపి రెడ్డి , కంకల  కిష్టయ్య, కొండూరు సాయి  తదితరులు  ఈ కార్యక్రమంలో మాందాపురం గ్రామ శాఖ అధ్యక్షుడు పల్చం నవీన్ కుమార్ గౌడ్ దంతూరి అంజయ్య గౌడ్ శివ గౌడ్ ,సోలిపురంవెంకట్ రెడ్డి ఆంజనేయులు, ఉప సర్పంచ్ స్వామి, గాలయ్య.అక్కంపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు దేశ్ రెడ్డి వీరారెడ్డి  బుంగ పట్ల మత్స్యగిరి నిమ్మల కృష్ణ పాల్గొన్నారు.