భువనగిరిలో కుంభం కీర్తి రెడ్డి ప్రచారం….

నవతెలంగాణ- భువనగిరి: భువనగిరి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిల్ కుమార్ రెడ్డి కి హస్తం గుర్తుకు ఓటు వేయాలని  కోరుతూ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె కీర్తి రెడ్డి గురువారం ఇంటింటా ప్రచారము నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు పట్టణంలో మహిళలు డప్పుల, చప్పుల్ల మధ్య  మంగళహారతులు,పూల వర్షంతో అపూర్వ స్వాగతం పలికారు. అద్భుతమైన మెజారిటీతో అనిల్ కుమార్ రెడ్డి ని అసెంబ్లీకి పంపిస్తామంటున్న భువనగిరి పట్టణ ప్రజలు హామీ ఇచ్చినట్లు తెలిపారు. పట్టణంలోని 15,16,17వ వార్డులలో గడప గడపకి కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకి వివరించి, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన గొప్ప గొప్ప పథకాలను గుర్తు చేస్తూ, గెలిచిన తర్వాత తాము చేయబోయే అభివృద్ధి, సేవా కార్యక్రమాలను గూర్చి చెబుతూ ప్రజల మద్దతు  కోరినట్లు తెలిపారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ, ఆపదలో అండగా ఉంటున్న అనిల్ కుమార్ రెడ్డి రికి ఓటు వేసి ఆశీర్వధించవల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో వారి వెంట పట్టణానికి చెందిన మహిళలు, వివిధ అనుబంధ సంఘాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.