భువనగిరి ఎంపీ సీటుకు భువనగిరి ఎమ్మెల్యే కూతురు కుంభం కీర్తి రెడ్డి శనివారం గాంధీభవన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భువనగిరి ఎంపీ సీటుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. కాగా కీర్తి రెడ్డి తన తండ్రి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గెలుపు కోసం బూత్ కమిటీలు వేసి, కష్టపడి గెలుపులో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఎన్నికల ప్రచార సమయంలో తన తండ్రి ఒకవైపు ప్రచారం నిర్వహిస్తుంటే, తాను ప్రచార శైలిని పరిశీలిస్తూ, సర్పంచ్లు, ఎంపీటీసీలు ప్రజలతో మమేకమై గెలుపు కోసం కృషి చేసిన అనుభవం ఉంది.