కుంభం అనిల్ కుమార్ రెడ్డిని గెలిపించాలి..

– మలి దశ తెలంగాణ ఉద్యమకారుడు రావి సురేందర్ రెడ్డి..
నవతెలంగాణ- భువనగిరి రూరల్
భువనగిరి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డిని గెలిపించి , అసెంబ్లీకి పంపాలని, మలి దశ ఉద్యమకారుడు రావి సురేందర్ రెడ్డి కోరారు. గురువారం ఆయన టీచర్స్ కాలనీలో తొలిదశ, మలిదశ ఉద్యమకారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేయగా, మాట్లాడారు. తెలంగాణలో నిరుద్యోగుల త్యాగాలను, తెలంగాణ ఉద్యమ తీవ్రత చూసి సోనియా గాంధీ చలించి తెలంగాణ రాష్ట్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. సోనియా గాంధీ దయతోనే తెలంగాణ వచ్చిందని, ఈసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డిని అసెంబ్లీకి పంపడానికి భువనగిరి తెలంగాణ వేదిక కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అనంతరం వారు టీచర్స్ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి తెలంగాణ వేదిక కన్వీనర్లు మైసయ్య, బాల నరసయ్య, చిరంజీవిలు పాల్గొన్నారు.