
మండలంలోని ఉప్లూర్ గ్రామంలో శ్రీ బాల రాజ రాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నెలకొల్పిన నవదుర్గ మండలి దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు కుంకుమార్చన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదలను వితరణ చేశారు. కాగా దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు ఆరవ రోజు కాత్యాయని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.