మండల రాజకీయాల్లో కుమ్ములాట..

– క్యాడర్ లేని వారికి పదవులు ఇవ్వటమే కారణమా?
– కాళేశ్వరం బ్యాక్ వాటర్ బాధిత రైతుల్లో అసంతృప్తి
– సరైన నిర్ణయం తీసుకోక పోతే పరిహారం తప్పదా?
నవతెలంగాణ- కోటపల్లి
మండలంలో రాను రాను బీఆర్ఎస్ పరిస్థితి దయనియ్యంగా తయారయింది. కోటపల్లి మండలం దాదాపుగా నది పరివాహక ప్రాంత గ్రామాలే అధికం గ్రామాలలో కాలేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల నష్టపోయిన రైతులలో బీఆర్ఎస్  ప్రభుత్వం పై తీవ్ర సంతృప్తి నెలకొంది. అలాగే గ్రామాలలో బీఆర్ఎస్  నాయకులు చేసే చిల్లర చేష్టలతో గ్రామాలలో బిఆర్ఎస్ పట్టు తగ్గిందని చెప్పుకోవచ్చు. కేసీఆర్ సభకు గ్రామానికి నాలుగు నుంచి ఐదు బస్సులు వేసినా కూడా ఒక్కో బస్సులు 10 నుంచి 15 మంది మాత్రమే ఉన్నారని అపోహలు లేకపోలేదు.అలాగే చెన్నూర్ ఎమ్మెల్యే సోమవారం మండలంలో పర్యటించినప్పుడు ప్రజలు ఎమ్మెల్యే ను నిలదీసిన తీరు చూస్తే వ్యతిరేకత విలయ తాండవం చేస్తుందని చెప్పవచ్చు. దీనికి కారనం మండల స్థాయి నాయకులు తీసుకుంటున్న అసంఘటిత చర్యలే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
క్యాడర్ లేని వారికి పదవులు
మండలంలో మండల స్థాయి కమిటీలు వేసి మండల స్థాయి నాయకులను ఎన్నుకున్న తీరు బీఆర్ఎస్ పార్టీ వెనకబాటుకు కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు . మండల స్థాయి నాయకులలో కొందరు నాయకులకు వార్డు మెంబర్ కు కూడా గెలవలేని వారిని తీసుకొచ్చి మండల స్థాయి పదవులు అప్పజెప్పడం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. అలాగే వార్డు మెంబర్ కు కూడా గెలవలేని వారికి ఓటు బ్యాంకు ఎక్కడ ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మండలంలో ప్రజలను ఐక్యము చేయడంలో మండల నాయకులు వెనక పడ్డారని చెప్పుకోవచ్చు. ఈ మండల స్థాయి నాయకుల వల్ల గ్రామస్థాయిలో రెండు వర్గాలుగా ఏర్పడి బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయని పలువు అభిప్రాయ పడుకున్నారు. మండల స్థాయి అధికారులు గ్రామాలలో ఉన్న రెండు వర్గాలలో ఒక వర్గానికి మాత్రమే సపోర్ట్ చేయడం వల్ల బీఆర్ఎస్ తేలిపోయే ప్రమాదం ఉందని ఇలాంటి తలతిక్క వాళ్ళతో పార్టీకి అన్యాయం జరుగుతుందని పలువురు రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. గ్రామాలలో ఎన్ని విభేదాలు ఉన్నా ఎమ్మెల్యే బాల్క సుమన్ వల్లనే బిఆర్ఎస్ పార్టీలో ఉంటున్నం తప్ప ఈ మండల స్థాయి నాయకులు తీసుకునే నిర్ణయాలపై కాదని పలువురు సీనియర్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.
మండలమే డిఫరెంట్
కోటపల్లి మండలం అంటేనే కాంగ్రెస్ కి పెట్టిన పేరుగా గత ఎలక్షన్ ఫలితాలను బట్టి చెప్పవచ్చు. గడిచిన ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ఓట్లు ఎక్కువగా పడ్డాయి అనడానికి ఆశ్చర్యం లేదు. సుమన్ వచ్చినాక మండలంలో కాంగ్రెస్ ని వదిలి బీఆర్ఎస్ లో చేరిన వారు అనేకులు ఉన్నారు కానీ మండల స్థాయి లీడర్ల వ్యతిరేక పోకడల వల్ల ఆ కాస్త ఓట్లు చీలిపోయి బీఆర్ఎస్ కి పెను ప్రమాదం పొంచి ఉందని పలువురు సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. మండలంలో ఓటు బ్యాంకు ఉన్న నాయకులను పక్కనపెట్టి ఓటు బ్యాంకు లేని నాయకులను పట్టుకొని ఎంతవరకు మండలంలో రాణిస్తారని పలువురు సీనియర్ నాయకులు అభిప్రాయ పడుతున్నారు. ఇలానే ఉంటే ఎన్నికల మేఘాల మోగిన తర్వాత పరిస్థితులు చేయి జారిపోతాయని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళాట్లేదా
మండలంలోని పలు గ్రామాలలో జరుగుతున్న గ్రూపు రాజకీయాలు ఎమ్మెల్యే దృష్టికి వెళ్లట్లేదా అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మండలంలో ఎమ్మెల్యే స్థాయికి తగ్గ నాయకులు కూడా ఏమి చేయలేనీ పరిస్థితిలో ఉందంటే మండల స్థాయి అధికారుల ప్రభావం మండలం పై ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మండల బీఆర్ఎస్ నాయకులు చిచ్చులు పెట్టడానికే తప్ప కలుపుగోలుగా ఉండరు అని పలువురి వాదన.