
నవతెలంగాణ – చివ్వేంల
నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపుతో పాటు అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అడ్డా అని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెన్న మధుకర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో స్థానిక విలేకరుల తో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ తో కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని తెలిపారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం, కార్యకర్తల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని, వారి సారథ్యంలో సూర్యపేట నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి కి అత్యధిక మెజార్టీ కోసం ప్రతి ఒక్క కార్యకర్త కంకనబద్ధుడై పని చెయ్యాలని సూచించారు. సూర్యాపేట నియోజకవర్గం లో రాంరెడ్డి దామోదర్ రెడ్డి సత్తా చూపించాలన్నారు. కాంగ్రెస్ నల్గొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గెలుపుతో పాటు యువ నాయకుడు రాహూల్ గాంధీ ఇండియా కూటమి తరపున ఖచ్చితంగా ప్రధాన మంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తంచేశారు.