కురుమ సంఘం నూతన కార్యవర్గం

Kuruma Sangam is a new working groupనవతెలంగాణ – బాన్సువాడ/ నసురుల్లా బాద్ 
బాన్సువాడ పట్టణ కురుమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలో కురుమ సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక కోసం సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో కుర్మా సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో అధ్యక్షులుగా ఒగ్గు గంగారాం, ఉపాధ్యక్షులుగా ఉప్పరిగారి సాయిగొండ, ప్రధాన కార్యదర్శిగా ఎడిగి మల్లయ్య, కోశాధికారిగా పరుగొండ సాయిలు, కార్యవర్గ సభ్యులు దుర్కి పెద్ద సంగయ్య, కురుమ గంగాధర్, బీర్కూర్ హన్మాండ్లు, కొత్త కురుమ మల్లేష్, గజ్జెల రమేష్, గౌరవ అధ్యక్షులుగా ఉప్పరిగారి బీరుగొండ, పరుగొండ గంగారాం, ఉప్పరిగారి నర్సుగొండను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. సంఘం అభ్యున్నతికి పాటుపడతామని ఈసందర్భంగా నూతన కార్యవర్గం ప్రతినిధులు తెలిపారు. కురుమల కోసం ప్రభుత్వం ద్వారా పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు, సభ్యులు పాల్గొన్నారు.