కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో పోలియో చుక్కలు వేసిన కుశాల్

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలో ఆదివారం నాడు పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతంగా ప్రారంభమైంది. మండల కేంద్రంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆసుపత్రిలో ఉదయం పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఎంపీటీసీ సంగీత కుశాల్ చిన్నారులకు చుక్కలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 0.5 వయస్సు చిన్నారి పిల్లలందరికీ తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని ఆయన తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఆశా వర్కర్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.