జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి:కేవీపీఎస్‌

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
గ్రామ పంచాయితీ కార్మికుల సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్‌) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి జాన్‌ వెస్లీ, టి స్కైలాబ్‌బాబు గురువారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.కార్మికు ల వేతనాలు పెంచాలనీ, కారోబార్లు , బిల్‌ కలెక్టర్లను సహాయ కార్యదర్శులు గా నియమించాలని కోరుతున్నారని గుర్తుచేశారు. పీఆర్‌సీి నిర్ణయించినట్టు జీవో నెం 60 ప్రకారం రూ. 19వేలు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జీవో నెంబర్‌ 51 ప్రకారం మల్టిపర్పస్‌ విధానాన్ని రద్దు చేసీ, పాత కేటగిరి విధానాన్ని అమలు చే యాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదంలో మరణించిన కార్మికుడికి రూ.10 లక్ష ల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని డిమాం డ్‌ చేశారు.కార్మికుల నిరవధిక సమ్మెకు అన్ని పార్టీలు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాలని కోరారు.