నిజాంబాద్ నగరంలోని ఎలక్ట్రిసిటీ ఆర్టిజన్ కార్మికులు ఈ నెల 20 తారీకు నుండి తమ సమస్యల పైన రిలే నిరాహారశ దీక్ష చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు చేస్తున్నటువంటి దీక్షను సందర్శించి మద్దతు పలికిన కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండగంగాధర్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి పోరాటాలు మార్గమని పోరాటం ద్వారానే సమస్యల పరిష్కారానికి మార్గము ఉంటుందన్నారు విద్యావంతులు మేధావులు ఉన్నప్పటికీ ప్రతిభ గుర్తించకుండా వెట్టి చాకిరి చేయించుకుంటున్న ప్రభుత్వం శ శృంఖలాల నుండి విముక్తి కల్పించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారికి పదోన్నతులు కల్పించాలని అన్నారు.అనంతరం కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు నలవాల నరసయ్య దీక్షను సందర్శించి సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ ఆర్టిజన్ కార్మికులు , మండల నాయకులు షేక్ అఫ్జల్ పాల్గొన్నారు.