కంటికి రెప్పాలా కాపాడుకునే బాధ్యత నాదే: క్యామ మల్లేష్

– ఏ పార్టీకి లేనంత బలగం బీఆర్ఎస్ కు ఉంది
– మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్
– భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్
నవతెలంగాణ – బొమ్మలరామారం
ఏ పార్టీకి లేనంత బలగం బిఆర్ఎస్ కు ఉందని భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ అన్నారు. బొమ్మలరామారం మండలంలోని నాగినేనిపల్లి, బొమ్మలరమారం, చీకటిమామిడి, మార్యాల,గ్రామాల్లో గురువారం మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అధ్యక్షతన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో సమావే శాన్ని నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ కు స్థానిక నాయకులు అభ్యర్థికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్బంగా అభ్యర్థి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని నాలుగు నెలలోనే ప్రజలకు ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగిందని. ప్రస్తుతం కేవలం 1.8 శాతం ఓట్లతో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చింది. 4నెలలోనే అన్నం పెట్టె రైతు ఎంత ఇబ్బంది పడుతున్నాడో,సీఎం రేవంత్ రెడ్డి గిట్టుబాటు ధర తో పాటు రూ.500బోనస్ ఇస్తా అన్నాడు. బోనస్ దేవుడికి తెలుసు కానీ ఎక్కడ చూసిన రైతుల కల్లాలా వద్ద వడ్లు కనిపిస్తున్నావ్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే రైతుబంధు బంద్, 24 గంటల కరెంట్ బంద్, పింఛన్ బంద్, నీళ్లు బంద్ అయినై…చివరికి కాంగ్రెస్ బంద్ అయ్యే పరిస్థితి వస్తది. దేశంలో కాంగ్రెస్ బలహీన పడుతోంది ప్రభుత్వం అన్నం పెట్టె రైతులను ఇబ్బంది పెడుతుంది..అసలు ప్రజలు సంక్షేమ పథకాలు ఇస్తారా లేదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ..13వ తేదీన జరిగే ఎన్నికల్లో కార్ గుర్తు 2వ నెంబర్ పై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో,జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు సుదగాని హరిశంకర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్,రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి,నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త గుజ్జ యుగేందర్ రావు,బి.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పోలగాని వెంకటేష్ గౌడ్, ఎంపిపి  చీమ్ముల సుధీర్ రెడ్డి,సింగిల్ విండో చైర్మన్ గుదె బాలనర్సీంహ్మ, నాయకులు,కుశుంగుల  సత్యనారాయణ,మాజీ ఉప సర్పంచ్ జూపల్లి భరత్, బోనకుర మల్లేష్, కట్ట శ్రీకాంత్,బట్కూరి బీరప్ప,రాజు యాదవ్,నాయకులు  తదితరలు పాల్గొన్నారు.