రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ టెక్నికల్‌కు ఎంపికైన క్యాతం శ్రీకాంత్‌యాదవ్‌

నవతెలంగాణ-గండిపేట్‌
నేషనల్‌ స్థాయిల్లో రెజ్లింగ్‌ పోటీల శిక్షణ ఇచ్చేందుకు రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ టెక్నికగా ఎంపికైన రంగారెడ్డి జిల్లా తరుపున క్యాతం శ్రీకాంత్‌యాదవ్‌ను గండిపేట్‌ మండలాధ్యక్షులు క్యాతం అశోక్‌ యాదవ్‌ అభినందించారు. శనివారం నగరం నుండి పూణేల్లో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పాల్గొనేందుకు బయలుదేరినట్టు తెలిపారు. రెజ్లింగ్‌ పోటీల్లో మరిన్ని విజయాలను సాధిస్తూ నేషనల్‌ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.