కార్మికుడి భద్రతకు లేబర్ కార్డు అవసరం: చందన

– నూతన భవనంలోకి లేబర్ కార్యాలయం
నవతెలంగాణ – జమ్మికుంట
లేబర్ కార్డు అనేది కార్మికుడి భద్రత, అభివృద్ధి, విద్య, భద్రతను చూసుకుంటుందని హుజురాబాద్ లేబర్ ఆఫీసర్ చందన అన్నారు. సోమవారం జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. హుజురాబాద్ లేబర్ కార్యాలయాన్ని కరీంనగర్ రోడ్డు లోని విద్యానగర్, లలిత   వాటర్ ప్లాంట్ దగ్గర బ్యాక్ పోర్షన్   లోకి మార్చడం జరిగిందని అన్నారు. కాబట్టి అవసరం ఉన్నటువంటి వారు, లేబర్ కార్డు కలిగి ఉన్న కార్మికులందరూ గమనించి నూతన భవన  కార్యాలయం లోకి వచ్చి తమ పనులను చేసుకోవాలన్నారు . లేబర్ పనిచేసే కార్మికులకు ఇచ్చే కార్డు ను లేబర్ కార్డు అంటారని ఆమె తెలిపారు. ఈ కార్డు ద్వారా లబ్ధిదారులు వివిధ రకాల సేవలు , సౌకర్యాలను పొందవచ్చు అని చెప్పారు. లేబర్ కార్డ్ అనేది రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ జారీ చేసిన గుర్తింపు కార్డు అని అన్నారు. గర్భధారణ, ప్రసవ సమయంలో మహిళలకుసహాయంఅందించబడుతుందని చెప్పారు. ప్రమాదం కారణంగా మరణం లేదాగాయంవిషయంలోసహాయంఅందించబడుతుందని తెలిపారు. పిల్లల చదువుల కోసం స్కాలర్‌షిప్‌లు, గడ్డపారలు  ఇతర రకాల పరికరాల కొనుగోలు కోసం ఆర్థిక సహాయం అందించబడునని తెలిపారు.