బీజేపీని గద్దె దించేందుకు కార్మిక, కర్షకులు సిద్ధం కావాలి

– వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య
నవతెలంగాణ-వికారాబాద్‌ ప్రతినిధి
కేంద్రంలోని బీజేపీని గద్దె దించేందుకు కార్మిక, కర్షకు లు సిద్ధం కావాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య పిలుపునిచ్చారు. శనివారం సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల జిల్లా సదస్సు వికారాబాద్‌లో జరిగింది. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆర్‌.మహిపాల్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమా వేశానికి వెంకటయ్య హాజరై మాట్లాడారు.. తాము అధికా రంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తా మని చెప్పిన మోడీ.. నిరుద్యోగులను మోసం చేశాడని అన్నారు. నల్లధనం వెనక్కి తీసుకొచ్చి ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.15వేలు వేస్తామని చెప్పి పది పైసలు కూడా వేయలేదన్నారు. కానీ కార్పొరేటర్లకు మాత్రం లక్షల కోట్లు మాఫీ చేశారన్నారు. మోడీ హయాంలో దేశంలో అన్నిరం గాల్లో వెనకబడిందన్నారు. గతంలో కంటే శ్రామికుల నిజ వేతనాలు 20శాతం తగ్గాయని అన్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కేరళ తరహా లో రుణ విమోచన చట్టం తీసుకువచ్చి రైతులను ఆదుకో వాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ పని దినాలను 200 రోజులకు పెంచాలన్నారు. రోజు వారీ కూలీ రూ. 600 ఇవ్వాలన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామ కృష్ణ, వ్యకాస జిల్లా అధ్యక్షులు యూ.బుగ్గప్ప మాట్లాడుతూ రామ మందిరం పూర్తి నిర్మాణం చేయకుండానే లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ రాముడిని వాడుకుంటోందన్నారు. ప్రజలను ఆ మాయలో పడేసి మళ్లీ అధికారం చేపట్టడానికి మోడీ ప్రయత్నాలు చేస్తున్నాడని మండిపడ్డారు. అలాంటి భ్రమలకు గురికాకుండా కార్మిక, కర్షక లోకం జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ నెల 26న జిల్లా, మండలకేంద్రాల్లో బైక్‌ ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 16 గ్రామీణ బంద్‌ నిర్వహిస్తామని తెలిపారు. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై కరపత్రాలను ముద్రించి ఇంటింటికీ పంపిణీ చేస్తామన్నారు. ఈ సమావేశంలో సీఐటీయూ జి ల్లా ఉపాధ్యక్షులు లాలయ్య, వ్యకాస ఉపాధ్యక్షులు సత్య య్య, రఘురామ్‌, తదితరులు పాల్గొన్నారు.