
700 మంది పైగా ప్రాణత్యాగం చేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రపంచాన్ని ఆలోచింపజేసిన రైతంగ పోరాటం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెడలు వంచి ఆయనే చేసిన రైతు వ్యతిరేక మూడు చట్టాలని ఆయనతోనే రాతపూర్వకంగా రద్దు చేయింకొనేలా చరిత్ర సృష్టించింది. సంక్షేమ పథకాలు ప్రవేశపెడతావని హామీ ఇచ్చినా అది హామీకే పరిమితమై ఆచరణకు నోచుకోలేదు. అందుకోసం హామీలు అమలు చేయాలని ప్రతి గణతంత్ర దినోత్సవం రోజు నిరసన ర్యాలీ చేపడుతూ ప్రభుత్వ దృష్టికి, రాజకీయ పార్టీల దృష్టికి సమాజం దృష్టికి తీసుకెళ్తున్నాం. కనీసం 75వ గణతంత్ర దినోత్సవ జరుపుకుంటున్న తరుణంలోనైనా అమలు చేస్తాడేమో అని శుక్రవారం స్థానిక గాంధీ చౌక్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు దేవారం అధ్యక్ష వహించగా..ఎస్ కే ఎం జిల్లా కమిటీ నాయకులు పెద్ది వెంకట్రాములు, పల్లపు వెంకటేష్, రాజేశ్వర్, గంగాధరప్ప, గంగారాం, జెపి గంగాధర్, గుమ్మల గంగాధర్, నందిపేట గంగాధర్, భాస్కర్, గంగారెడ్డి పాల్గొనగా.. మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, ట్రెడిన్లు, విద్యార్థి సంఘాలు, వృత్తి సంఘాలు, మహిళా సంఘాలు పాల్గొన్నాయి. సిఐటియు జిల్లా అధ్యక్ష-కార్యదర్శులు శంకర్ గౌడ్- నూర్జహాన్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఓమయ్య, ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు భూమయ్య, వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇడగొట్టి సాయిలు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు విగ్నేష్, నగర కార్యదర్శి మహేష్, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… స్వతంత్రానంతరం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోరాటం చేసి, 700 మంది పైగా ప్రాణాలను త్యాగం చేసి, రైతు వ్యతిరేక చట్టాలని వెనక్కి తిప్పికొట్టిన ఘనత రైతు వీరోచిత పోరాటానికి దక్కింది. ఆ సందర్భంగా రైతు సంక్షేమం కోసం ఇచ్చిన హామీలని ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేయకపోగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అలాగే వ్యవసాయ కూలీలకు పని కల్పించడం కోసం తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి కుట్ర పన్నుతున్నారు. అందులో భాగమే ఉపాధి పని క్షేత్రాలలో ఉదయం సాయంత్రం ఫోటోలు తీసి రెండు ఫోటోలు ట్యాలీ అయితేనే డబ్బులు ఇస్తామని బెదిరిస్తున్నారు. పైగా 80% పైగా ఉన్న పేద రైతులు వృత్తిదారులు కూలీ లు ఓటేసి గెలిపిస్తేనే ప్రధానమంత్రి అయ్యాడు అన్న విషయాన్ని మర్చిపోయి ఆయనకు అధికార పీఠాన్ని కట్టబెట్టిన ప్రజలను దొంగలుగా చూస్తున్నారని ఎద్దేవా చేశారు. అందులో భాగమే ఉపాధి పక్షేత్రాలలో డ్రోన్ల ద్వారా పరిశీలించి ఉదయం సాయంత్రం తీసిన ఫోటోలకు డ్రోన్ తీసిన ఫోటోలకు ట్యాలీ అయితేనే పైసలు ఇస్తామని అంటున్నారు. ఇప్పటికే అనేక నెపాలతో ఒక కోటి మందిని జాబ్ కార్డ్ నుంచి తగ్గించిన నీచ చరిత్ర మోడీ కున్నదని ఎద్దేవా చేశారు. అలాగే సంఘటిత సంఘటిత రంగ 44 కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా మార్చి అభద్రత భావం కల్పించి, కార్పొరేట్ సంస్థలకు పారిశ్రామిక సంస్థలకు బానిసలుగా మార్చినటువంటి నీచ చరిత్ర మోడీకి ఉన్నదని ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నారు. 75 వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని అయినా ఈ సమస్యలను పరిష్కరించకపోతే రేపు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.